తెరాస మరీ ఇంత దిగ‌జారిందా

తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర స‌మితి. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ. ఈ పార్టీలో సీఎం కేసీఆర్‌, హారీష్‌రావు, కేటీఆర్‌, క‌విత వీరే పెద్ద స్థాయి నేత‌లు. వీరి స‌మ‌క్షంలో పార్టీలో చేరాలంటే అవ‌త‌లి వ్య‌క్తి కూడా అదే స్థాయికి చెందిన నేత కావాలి. లేదంటే ఓ పెద్ద వ్యాపార వేత్త‌నో కావాలి. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఓ ఎంపిటీసీని పార్టీలో ఆహ్వానించ‌డానికి ఎమ్మెల్సీ క‌విత ముందుకు వ‌చ్చింది.

ఇందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో భాజ‌పా, తెరాసల మ‌ధ్య ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గు మంటోంది. ఇటీవ‌ల బీజేపీ ఎంపీ అర‌వింద్‌పై తెరాస శ్రేణుల దాడికి ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మైంది. గ‌త కొన్ని రోజులుగా నువ్వా నేనా అంటూ సాగుతున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే జీవ‌న్ నందిపేట బీజేపీ ఎంపీటీసీ అరుణ చావన్‌ ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేర్పించారు. ఇందుకు సీఎం కుతూరుని రంగంలోకి దింప‌డంతో తెరాస ఏ స్థాయికి దిగ‌జారిందో తెలిసిపోతోంద‌ని అంటున్నారు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు.