హీరోయిన్ కాజోల్‌కి క‌రోనా

క‌రోనా మూడో ద‌శ నుండి ఎవ్వ‌రూ త‌ప్పించుకోవ‌డం లేదు. ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్న వైర‌స్ మాత్రం ఆగడం లేదు. ప్ర‌తి ఒక్క‌రిని త‌న గుప్పిట్లో బంధిస్తోంది.ముఖ్యంగా మూడో ద‌శ‌లో రాజ‌కీయ వేత్త‌లు, సినిమా న‌టులు, సెల‌బ్రెటీలలో ఎక్కువ‌గా సోకింది. తాజాగా స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా కరోనా బారిన పడింది. తనకు వైరస్ సోకినట్టు ఆమె ప్రకటించింది. తనకు కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ప్రకటించిన కాజోల్, ప్రస్తుతం తన ముక్కును చూపించలేదనని, అందుకే తనకు ఎంతో ఇష్టమైన తన కూతురు నవ్వును పోస్ట్ చేస్తున్నానంటూ నైసా దేవగన్ స్మైలింగ్ ఫొటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం కాజోల్ ఐసొలేషన్ లోకి వెళ్లింది. కాజోల్ కు కరోనా సోకడంతో ఆమె భర్త అజయ్ దేవగన్ కార్యక్రమాలపై ఆ ప్రభావం పడింది. ప్రస్తుతం వరుస షూటింగ్స్, ప్రెస్ మీట్స్ తో బిజీగా ఉన్నాడు అజయ్ దేవగన్. అతడు నటించిన రుద్ర అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా ట్రయిలర్ రిలీజైంది. ఈ కార్యక్రమాల్లో అతడు చురుగ్గా పాల్గొన్నాడు. ప్రస్తుతానికి అజయ్ దేవగన్ తన హెల్త్ స్టేటస్ ను వెల్లడించలేదు.