కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ హీరోయిన్‌

దేశంలో ప‌లు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాకాపుట్టుస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ఆయా పార్టీల్లో చేరికలు, వలసలు ఊపందుకున్నాయి. తాజాగా, మిస్ గ్రాండ్ ఇండియా మాజీ అందాలరాణి అనుకృతి గుసైన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుకృతి ఉత్తరాఖండ్ మాజీ మంత్రి డాక్టర్ హరాక్ సింగ్ రావత్ కుమారుడు తుషిత్ రావత్ ను పెళ్లాడారు.

ఇటీవల హరాక్ సింగ్ రావత్ ను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగించారు. దాంతో ఆయన బీజేపీ అధిష్ఠానంపై అలకబూని పార్టీని వీడారు. కోడలితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, అనుకృతి గుసైన్ ను కాంగ్రెస్ పార్టీ లాన్స్ డౌన్ నియోజకవర్గం నుంచి బరిలో దింపుతోంది. అనుకృతి లాన్స్ డౌన్ ప్రాంతంలోని ఖండోలీ గ్రామంలో జన్మించారు. ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగ‌నున్నాయి.