సీఎం కేసీఆర్ని కలిసిన శంభీపూర్ రాజు
మేడ్చల్ జిల్లాలో తెరాసను అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని అన్నారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. జిల్లా అధ్యక్షుడి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ని కలిశారు. జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు ఇచ్చినందుకు మార్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా తెరాస తీసుకుంటున్న నిర్ణయాలతో అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు.