ఐపీఓకి డీఆర్‌హెచ్‌పీ దరఖాస్తు చేసిన ఫ్యాబ్ ఇండియా లిమిటెడ్
భారతదేశపు మొట్టమొదటి ఈఎస్‌జీ ఐపీఓ సిద్ధమవుతుంది. ఫ్యాబ్ ఇండియా లిమిటెడ్ తమ తొలి ఐపీఓ కోసం డీఆర్‌హెచ్‌పీని మార్కెట్ రెగ్యులేటర్ వద్ద దరఖాస్తు చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా 500 కోట్ల రూపాయల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటుగా ప్రస్తుత మదుపరులు/వాటాదారులకు చెందిన 25,050,543 ఈక్విటీ షేర్లను విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు.
భారతదేశపు మొట్టమొదటి ఈఎస్‌జీ ఐపీఓగా ఫ్యాబ్ ఇండియా ఎందుకు నిలుస్తుందంటే…
ఫ్యాబ్ ఇండియా ఇప్పటికే 50వేలక పైగా ఆర్టిషియన్లకు తగిన సాధికారిత అందించింది. వీరిలో 64% మంది మహిళలు. అందునా 70% మంది ఇళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఈ కంపెనీ 2200 మంది రైతులతో నేరుగా పనిచేయడంతో పాటుగా 10300 మంది రైతులతో భాగస్వామ్య సంస్థల ద్వారా పనిచేస్తూ సస్టెయినబల్ వ్యవసాయ ప్రక్రియలను సృష్టిస్తుంది.
కంపెనీ లేదంటే అనుబంధ సంస్థలతో సంబంధం కలిగిన నిర్థిష్టమైన ఆర్టిషియన్లతో పాటుగా రైతులకు ప్రోత్సాహకాలను అందించడంతో పాటుగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడంలో భాగంగా ఫ్యాబ్‌ఇండియా యొక్క ప్రమోటర్లు అయిన బీమ్లా నంద బిస్సెల్ మరియు మధుకర్ ఖేరాలు వరుసగా 4లక్షలు మరియు 3,75,080 ఈక్విటీ షేర్లను బదిలీ చేయనున్నట్లు జనవరి 14,2022న విడుదల చేసిన లేఖ ద్వారా వెల్లడించారు.
జనవరి 15,2022న జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఫ్యాబ్ ఇండియా ప్రమోటర్లలో ఒకరైన నంద బిస్సెల్‌సైతం 32,200 ఈక్విటీ షేర్లను బదిలీ చేయనున్నట్లు తెలియజేశారు.
ఐపీఓ ఆఫర్ కోసం విక్రయానికి అందుబాటులో ఉంచిన సెల్లింగ్ షేర్‌హోల్డర్లు
బీమ్లా నంద బిస్సెల్, విలియం నంద బిస్సెల్ మరియు మధుకర్ ఖేరాతో సహా ప్రమోటర్ సెల్లింగ్ షేర్ హోల్డర్లు మరియు ప్రమోటర్ గ్రూప్ సెల్లింగ్ షేర్ హోల్డర్లు విజయ్ కుమార్ కపూర్, మినీ కపూర్‌లు కాగా ఆపర్ట్యునిటీస్ ఫండ్ 1, ప్రాజిమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఇన్వెస్టర్ సెల్లింగ్ షేర్ హోల్డర్లు. ఇతర సెల్లింగ్ షేర్ హోల్డర్లలో ఇండియా 2020 ఫండ్ 2, లిమిటెడ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, కోటక్ ఇండియా అడ్వాంటేజ్ ఫండ్ –1, ఐఫిస్ కార్పోరేట్ ఎడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్‌ట్రస్ట్ ఆఫీస్ లీగల్ అండ్ ట్రస్టీషిప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఇతర సెల్లింగ్ షేర్‌హోల్డర్లు.