భారీ లక్ష్యంతో బరిలోకి భారత్
ఇండియాతో జరుగుతున్న తొలి వన్దేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులను సాధించింది. బవుమా (110 పరుగులు, 143 బంతులు, 8 ఫోర్లు), డుస్సేన్ (129 పరుగులు, 96 బంతులు, 9 ఫోర్లు, 4 సిక్సర్లు.. నాటౌట్) భారత బౌలర్లను చితకబాదడంతో సఫారీల స్కోరు బోర్డు దూసుకుపోయింది.
దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్ మెన్లలో డీకాక్ (27), మలాన్ (6), మార్క్ రామ్ (4), మిల్లర్ (2) పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో 18 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. మార్క్ రామ్ రనౌట్ అయ్యాడు. డుస్సేన్, మిల్లర్ నాటౌట్ గా నిలిచారు. 297 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగి 19 ఓవర్లు ముగిసే సరికి 102 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.