తెలంగాణలో 3500 దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అలజడి సృష్టిస్తోంది. తాజాగా చేసిన కరోన పరీక్షల్లో 3557 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోన తీవ్రత ఎక్కువ లేదని లౌక్డౌన్ కానీ, నైట్ కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే మరసటి రోజే గతం కంటే ఎక్కువగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.