గుజరాత్ లోని ముంద్రాలో తన తయారీ కేంద్రం ప్రారంభించిన బి మెడికల్ సిస్టమ్స్


జనవరి, 2022 – ముంద్రా, గుజరాత్: మెడికల్ కోల్డ్ చెయిన్ సొల్యూషన్స్ లో అంతర్జాతీయ అగ్రగామి, లగ్జెంబర్గ్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న బి మెడికల్ సిస్టమ్స్గుజరాత్ లోని ముంద్రాలో తన తయారీ కేంద్రం ప్రారంభించింది. పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రూ. 100 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రం వ్యాక్సిన్ రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లు, ట్రాన్స్ పోర్ట్ బాక్స్ ల వంటి మెడికల్ కోల్డ్ చెయిన్ ఉత్పాదనలను 100,000 యూనిట్ల మేరకు తయారు చేసే సామర్థ్యాన్ని కలిగిఉంటుంది. డిమాండ్ ఆధారంగా ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం కూడా ఉంది. ముంద్రాలోని కర్మాగారం కంపెనీకి సంబంధించి యూరప్ వెలుపల నిర్మించిన మొట్టమొదటి తయారీ కేంద్రం. కచ్ ప్రాంతంలో ఇది వేలాది ఉద్యోగావకాశాల ను కల్పించనుంది.
లగ్జెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్ ఈ సందర్భంగా తన సందేశాన్ని అందించారు. ‘‘ఒక ఏడాది క్రితం గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యాను. ఆ ఫలితం ఎంతో వేగంగా వచ్చింది. ఏడాది కంటే తక్కువ సమయంలోనే బి మెడికల్ సిస్టమ్స్ బృందం మేక్ ఇన్ ఇండియా తయారీ కేంద్రంతో వచ్చారు, గుజరాత్ రాష్ట్రంలో మెడికల్ కోల్డ్ చెయిన్ ఉపకరణాల ఉత్పత్తి ప్రారంభించారు. భారతదేశం అనుసరిస్తున్న ఇన్వెస్ట్ మెంట్ స్నేహ పూర్వక ధోరణికి నా అభినందనలు’’ అని అన్నారు. అందించిన సహకారానికి గాను భారతదేశ గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వానికి, ఇన్వెస్ట్ ఇండియా, ఇండెక్స్ టిబిలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
భారత ప్రభుత్వ ఫిషరీస్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రుపాలా ఈ సందర్భంగా బి మెడికల్ సిస్టమ్స యొక్క భారతదేశంలో మొదటిసారిగా తయారైన మల్టీ మోడ్ వ్యాక్సిన్ రిఫ్రిజిరేటర్ / ఫ్రీజర్ మరియు /లేదా ఐస్ ప్యాక్ ఫ్రీజర్ యూనిట్ ను ప్రారంభించారు. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను మెరుగుపర్చడంలో ఇవి కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ రుపాలా మాట్లాడుతూ, ‘‘ భారత్, లగ్జెంబర్గ్ ప్రధానమంత్రులకు నా అభినందనలు, వారి నాయకత్వ మార్గదర్శకత్వం కారణంగా ఈ ద్వైపాక్షిక ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది కోట్లాది మానవ జీవితాలను కాపాడడం మాత్రమే గాకుండా, జంతువుల ఆరోగ్య సంరక్షణకు కూడా తోడ్పడుతుంది’’ అని అన్నారు. భారతదేశ పశుసంవర్ధక రంగం తీరుతెన్నులను పరివర్తింప జేయడంలో శ్రీ రుపాలా ఎంతో కీలకంగా ఉన్నారు. ఈ పరివర్తన, ప్రధాని నరేంద్ర మోదీ ఆశించినట్లుగా రైతుల ఆదా యాలను రెట్టింపు చేయడంలో తోడ్పడనుంది.
ఈ ఫ్యాక్టరీని భారతదేశంలో గ్రాండ్ డచీ ఆఫ్ లగ్జెంబర్గ్ దౌత్యవేత్తగా ఉన్న పెగ్గీ ఫ్రాంట్ జెన్ ప్రారంభించారు. అదాని పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రక్షిత్ షా, ఇంటర్నేషనల్ పిడియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నవీన్ థాకర్, డాక్టర్ ఉపేంద్ర ఎస్. కింజవాడేకర్ (ప్రెసిడెంట్ ఎలెక్ట్ – 2022, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పిడియాట్రిక్స్), డాక్టర్ బాకుల్ పరేఖ్ (ప్రెసిడెంట్ -2022, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రారంభ వేడుకలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ. భూపేంద్ర రజనీకాంత్ పటేల్, శ్రీ సందీప్ చక్రవర్తి, IFS, అదానీ ఫౌండే షన్ చైర్‌పర్సన్, డా. ప్రీతి జి అదానీ, అదానీ పోర్ట్స్ &స్పెషల్ ఎకనామిక్ జోన్ ముఖ్యకార్యనిర్వహణాధికారికరణ్ అదానీ, ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ శ్రీ దీపక్ బాగ్లా, భారత ప్రభుత్వవిదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, అ నేక ఇతర ప్రముఖుల నుంచి నుండి వీడియో సందేశాలు అందాయి. గమనికలు కూడా జరిగాయి. అదానీ పోర్ట్స్, SEZ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరక్షిత్ షా, బిమెడికల్ సిస్టమ్ ఇండియా ప్రై.లి. ‘అవర్ మేక్ ఇన్ ఇండియా జర్నీ’ గత సంవత్సర ప్రయాణజ్ఞాపికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బి మెడికల్ సిస్టమ్స్ సీఈఓ శ్రీ లక్ ప్రొవొస్ట్ తన అభినందన సందేశం పంపించారు. ‘‘గత నాలుగు దశాబ్దాల కాలానికి పైగా బి మెడికల్ సిస్టమ్స్ అత్యాధునిక సాంకేతిక ఉత్పాదనలను ప్రపంచానికి అందిస్తోంది. నేడు ముంద్రా లో, అదాని గ్రూప్ ఆవరణలో మేం మరో ఆవాసం పొందాం. భారతదేశంలోకి మేం ప్రవేశించడం ఎంతో ఆహ్లాద కర అనుభూతిని అందించింది. భారత్, లగ్జెంబర్గ్ ప్రభుత్వాలతో సహా ఈ ప్రయాణంలో మాకు తోడ్పడిన ప్రతీ ఒక్కరికీ మా ధన్యవాదాలు’’ అని అన్నారు.