సంక్రాతి సెల‌వులు పొడ‌గించే యోచ‌న‌లో తెరాస స‌ర్కార్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండ‌డంతో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. క‌రోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుగానే 8వ తేదీ నుంచే ప్రకటించారు. ఇవి ఈ నెల 16తో ముగియాల్సి ఉంది. అయితే, కొవిడ్ కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. అంటే అప్పటి వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల సంక్రాంతి సెలవులను కూడా అప్పటి వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.