ఈ నెల 30 వరకు సెలవులు
రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ దృష్ట్యా పాఠశాలలకు సెలవులు పొడిగించింది. సంక్రాంతి పండగ సెలవులు ఈ రోజుతో ముగియనున్నాయి. అయితే తెలంగాణలో కేసులు అంతకంతుకు పెరుగుతుండడంతో ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.