పాండు మావకు కాస్త అవేశం ఎక్కువే
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన నాయకుడు. ఎక్కడ డిబెట్ పెట్టినా… అది ఏ ఛానెల్ అయినా.. అవతలి పక్క ఎవరున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ ప్రశ్నలు అడుగుతున్నారు అనేది ఈయనకు సంబంధం లేని విషయం. తానే ఏదీ చెప్పాలనుకుంటున్నాడు అదే చెప్పేస్తాడు. అవతలి వ్యక్తి కాస్త ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తే ఇక అంతే సంగతి. రూటు మార్చడమే.. మాట్లాడే అంశం వేరు.. ఆయన బుల్‌డోజ్ చేసే అంశం వేరు. ఏదీ ఏమైన తెలంగాణ రాజకీయాల పాలిట ఓ విచిత్రమైన వ్యక్తే అని చెప్పుకోక తప్పదు. అదే మన ఆర్మూర్ ఎమ్మెల్యే అసన్నగారి జీవన్‌రెడ్డి, తెలంగాణ వాళ్లు ముద్దుగా పిలుచుకునే పాండు మావ.
నిజానికి పాండుమావకి కాస్త అవేశం ఎక్కువే మరీ. ఇక న్యూస్ ఛానెళ్లు కూడా తమ రేటింగ్ పెంచుకోవడానికి వారికి కావాల్సిన మసాల దొరకుతుందని అతనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నప్పుడు చర్చలు మరింత రసవత్తరంగా సాగుతాయి. పాండు మావ వేసే మాటకు మాటకు రఘునందర్‌రావు సమాధానం చెప్పడం, అతను చెప్పగానే నీ ఫోన్ చూసుకో అనగానే ఫోన్ చెక్ చేయడం వంటి పనులు చేస్తుంటాడు. ఆ సమయంలో అతని ముఖంలో కనిపించే ఆహాభావాలు మాటల్లో చెప్పలేం.
ఈ సమయంలో చర్చ గట్టిగా జరుగుతున్న సమయంలో పాండుమావ టాఫిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఏకంగా బుల్‌డోజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. పక్కవారు ఏం మాట్లాడిన పట్టించుకోడు. తాను ఏం చెప్పదల్చుకున్నాడో అది చెప్పి…. ఆ చెప్పు ఏదో అంటున్నావు ఛమత్కరిస్తాడు.