హైదరాబాద్‌లో కరోన ప్రతాపం
తెలంగాణలో కరోన ప్రభావం మళ్లీ మొదలైంది. రాష్ట్రం వ్యాప్తంగా నమోదైన కేసులలో సగానికి పైగా హైదారాబాద్‌లోనే వచ్చాయి. దీంతో నగర ప్రజలు, వైద్య అధికారులు భయగుప్పిట్లోకి వెళ్లారు. పాజిటివ్ కేసులు భారీగా పెరగడం, ఓ వైపు సంక్రాంతి పండగ రావడం మరింత భయాన్ని సృష్టిస్తోంది. తాజాగా 1,015 కేసులు వెలుగు చూడగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 209, రంగారెడ్డి జిల్లాలో 159, హనుమకొండ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో మూడేసి చొప్పున కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి.