సన్‌షైన్ ఎండీ గురవారెడ్డి సంచలన వ్యాఖ్యలు
కరోనా మూడోదశ ఎలా అడ్డుకోవాలని ప్రజలు, ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి. అయితే ఈ దశలో సన్‌షైన్ హాస్పిటల్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీనితో తోడు ప్రముఖ దర్శకుడు హారీష్ శంకర్ తోడు కావడం, ఆ వీడియోని వైరల్ చేయడం మరింత సంచలనంగా మారింది.
కరోనా వైరస్ వల్ల ప్రజలు, ప్రభుత్వాలు భయపడుతున్న తరుణంలో గురువా రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఆ డాక్టర్ తో కలిసి హరీష్ శంకర్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్యంగా ఓమిక్రాన్ కేసుల విషయానికి వస్తే భయపడాల్సిందేమీ లేదనేస్తూ.. డాక్టర్ వివరిస్తున్న వీడియోను పంచుకున్నారు. వీడియోలో డాక్టర్ గురువా రెడ్డి వివరణ ఉంది. ఓమిక్రాన్ సాధారణ జలుబు తప్ప ఇంకేదీ కాదని టీకాలు వేయని వ్యక్తులు మాత్రమే ఎక్కువగా ప్రభావితమవుతారని వెల్లడించారు. మహమ్మారి ముగింపు దశకు చేరుకుంటుందని చెబుతూ అందరూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారు. దీనికి చాలా మంది నెటిజనులు కౌంటర్లు వేస్తున్నారు. ఆ ఇద్దరూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎటాక్ చేయడం ప్రారంభించారు.