తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
గడిచిన కొన్ని రోజులతో పోలిస్తే కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయి. అయితే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. గడచిన 24 గంటల్లో 48,583 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 1,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,165 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123 కేసులు గుర్తించారు. అదే సమమంలో 330 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.