ఐపీ బడ్డీ–రచిత్‌ మస్కట్‌ ఆవిష్కరించిన కేటీఆర్‌

తెలంగాణా రాష్ట్ర ఐటీ శాఖామాత్యులు కెటీ రామారావు డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ తెలంగాణా వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణా ఐసీ మస్కట్‌– ఐపీ బడ్డీ –రచిత్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డితో పాటుగా చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ మరియు ఐటీ , పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, రిసొల్యూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ రమిందర్‌ సింగ్‌ సోనీ, డీపీఎస్‌ ఛైర్మన్‌ ఎం కొమరయ్య, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు

నేటి ప్రచారంలో సృజనాత్మకత, ఆవిష్కరణ, ఐపీ భద్రతకు రచిత్‌ ప్రచారం చేయడంతో పాటుగా తెలంగాణాలో ఐపీ శావీ సంస్కృతిని సృష్టించనుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఐపీ మస్కట్‌ కార్యక్రమానికి రిజల్యూట్‌ 4ఐపీ తగిన మద్దతునందిస్తుంది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణా ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), రాక్‌ సాల్ట్‌లు సహకారం అందిస్తున్నాయి.

ఇటీవల భారత ప్రభుత్వ డీపీఐఐటీ ఆవిష్కరించిన నేషనల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవేర్‌నెస్‌ మిషన్‌ను అనుసరించి పాఠశాలలు, కళాశాలలు, వాటాదారుల నడుమ ఐపీ అవగాహన మెరుగుపరచడం అవసరం. దేశవ్యాప్తంగా ఐపీఆర్‌ల పట్ల పది లక్షల మందికి పైగా విద్యార్ధులకు అవగాహన కల్పించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఐపీ బడ్డీ ఇప్పుడు విద్యార్థులు, స్టార్టప్స్‌, ఎంఎస్‌ఎంఈలతో పాటుగా ఆసక్తి కలిగిన వాటాదారులతో కూడా కలిసి పనిచేస్తూ వారి ఇనిస్టిట్యూట్‌లు, కంపెనీలకు ఐపీ అంబాసిడర్లుగా ధృవీకరిస్తుంది. మార్చి 31 నాటికి 10వేల ఐపీ అంబాసిడర్లను సర్టిఫై చేయాలని లక్ష్యంగా చేసుకుంది.

ఐపీ బడ్డీ రచిత్‌ మీ ఆప్త మిత్రునిగా తోడుండటంతో పాటుగా 83411 10413 వాట్సాప్‌ నెంబర్‌ ద్వారా పనిచేస్తుంది. రిజల్యూట్‌ 4ఐపీ దీనికి మద్దతునందిస్తుంది.