తెలంగాణ‌లో మూడో వేవ్ మొద‌లైన‌ట్టే

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న క‌రోనా కేసులు చూస్తుంటే మూడో వేవ్ మొద‌లైన‌ట్టే అని వైద్య అధికారులు చెబుతున్నారు. గ‌డిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులు న‌మోదు కావ‌డం ఇటీవ‌ల కాలంలో ఇదే మొద‌టిసారి. అధికారులు ముందు నుంచి చెబుతున్న‌ట్లే… జ‌న‌వ‌రి రెండో వారంలో కేసులు అధికమ‌వుతున్నాయి. క‌రోనా మ‌ళ్లీ విజృంభ‌న చేస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని ఆసుప‌త్రుల్లో సౌక‌ర్యాలు మెరుగు ప‌ర‌చాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గాంధీ, ఉస్మానియాలో సేవ‌లు మ‌రింత అభివృద్ధి చేయాల‌న్నారు.