కేసీఆర్ కొర‌వితో త‌ల‌గొక్కుంటున్న‌రా ?

రాష్ట్రంలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే సీఎం కేసీఆర్ కొర‌వి త‌ల‌గొక్కుంటున్న‌ట్టే అనిపిస్తోంద‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీకి బ‌ద్ద శ‌త్రువుగా మారిన పార్టీ భాజ‌పా. ఎక్క‌డ స‌మ‌యం వ‌చ్చిన ఒంటి కాలుమీద లేచి నిల‌బ‌డి మ‌రీ టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామ‌ని సీఎం స్వ‌యంగా చెప్పారు. ఓ ప‌క్క వ‌రి కొనుగోలు విష‌యంలో కేంద్రాన్ని దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నాలు చేశారు.

అయితే భాజ‌పాను ఎలాగైన అణిచివేయాల‌నే దోర‌ణిలో ఉన్నట్టున్నారు సీఎం. అందుకే స‌రైన అవ‌కాశం కోసం వేచి చూస్తున్నారు. ఇందుకు ప్ర‌ధాన నిద‌ర్శ‌న‌మే బండి సంజ‌య్ అరెస్ట్‌. త‌న పార్టీ ఆఫీస్‌లో దీక్ష చేసుకుంటే క‌రోనా నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించార‌ని అత‌న్ని అరెస్ట్ చేశారు. భారీ పోలీస్ బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపి యుద్ధంలాగా చేశారు. జైలుకు త‌ర‌లించిన త‌ర్వాత కూడా అత‌నికి బెయిల్ రాకుండా అడ్డ‌కున్నారు. ఇది అంతా చూస్తుంటే కావాల‌ని సీఎం కేసీఆర్ భాజ‌పాపై ప్ర‌తికారం తీర్చ‌కుంటున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ విషయాల‌ను గ‌మ‌ణిస్తున్న కేంద్రం త‌న‌దైన శైలిలో బ‌దులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. కేంద్రం ఒక్క ఝ‌ల‌ఖ్ ఇస్తే…. ఏం చేయాలో తోచ‌క వ‌రి, ఉరి అనే అంశాన్ని ముందు వేసుకునే కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అలాంటి వారంత‌ట వారే భాజ‌పాను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తే కొర‌వితో త‌ల‌గొక్కోవ‌డ‌మేన‌నంటున్నారు ఆ పార్టీ నాయ‌కులు

ఏదీ ఏమైన బండి అరెస్ట్ ఎలాంటి రాజ‌కీయ ప‌రిణామాల‌కు తెర తీస్తుందో వేచి చూడాలి మ‌రి.