మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నన్ను చంపేస్తాడు తెరాస కౌన్సిలర్
తెలంగాణ రాష్ట్ర శ్రీనివాస్ గౌడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ 43వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బురుజు సుధాకర్‌రెడ్డి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరితోపాటు వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్ గౌడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అలాగే, విచారణ జరిపించి తనను బెదిరిస్తున్న వ్యక్తులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.