నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ మూతివేత‌

క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా ఇటీవ‌ల నాంప‌ల్లి ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్‌ శాఖ అధికారుల ఆదేశాలతో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల యజమానులకు తెలిపారు. దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్‌కు బ్రేక్‌ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్నిరోజులుగా నగరంతో పాటు రాష్ట్ర నలుమూలలా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందళన మొదలైంది.