తెలంగాణలో పెరుగుతున్న కరోన కేసులు
తెలంగాణ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మరో వైపు ఓమిక్రాన్ కూడా ప్రబలతుండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. కొన్నిరోజుల కిందటి వరకు 100కి అటూఇటూగా నమోదైన కొత్త కేసులు, ఇప్పుడు 400 దాటాయి. గడచిన 24 గంటల్లో 38,362 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 482 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 55, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.