సంక్రాతి తర్వాత ఆగమే ఇక
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. చాపకింద నీరులా వ్యాప్తిస్తున్న ఈ వైరస్‌కి ఇప్పుడు ఓమిక్రాప్ అనే కొత్త వేరియంట్ తోడైంది. ఈ కొత్త వేరియంట్‌తో ఇప్పటికే యూకేలో అనేక కేసులు నమోదైనాయి. దీని వల్ల లాక్‌డౌన్ పెట్టే వరకు వెళ్లింది. తాజాగా భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఎక్కువుగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 10 మంది మంత్రులకు, 20 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 50 మంది సిబ్బంది కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన సీఎం, వైరస్‌కి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక దేశ రాజధానిలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అక్కడ గతంలో విధించినట్టుగానే లాక్‌డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి.
ఇక తెలంగాణలో కూడా నిత్యం కరోనా కేసులు వ్యాప్తి కొనసాగుతోంది. అధికారులు ఇస్తున్న నివేదికల ప్రకారం చూస్తుంటే ఇక్కడ కూడా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడవుతున్నాయి. రాష్ట్రంలో మూడో దశ కరోనా వ్యాప్తి కొనసాగుతోందని హెల్త్ డైరెక్టర్ ఇటీవల వెల్లడించారు. అధికారుల ఘనాంకాలు, అప్రమత్తమవుతున్న తీరు చూస్తుంటే సంక్రాంతి తర్వాత పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు అనిపిస్తోంది. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.