కేటీఆర్‌కి డీనా ట్వీట్ క‌ల‌క‌లం

స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత అన్ని ఉద్యోగాలు, ప‌దువులు త‌మ వారికే వాస్తాయ‌ని చేయి చేయి క‌లిపి ఉద్య‌మం చేశారు. పోరాడి తెలంగాణ సాధించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా… ఇప్పుడు ప‌దువులు మాత్రం ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారు అనుభ‌విస్తున్నార‌ని మండిప‌డుతున్నారు తెరాస నేత‌లు. ఉద్య‌మంలో ప‌ని చేయ‌ని వారికి అందెల‌మెక్కిస్తున్నారని అగ్ర‌హిస్తున్నారు.

కొత్త సంవ‌త్స‌రంలోనైనా త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఇచ్చిన నామినేటేడ్ ప‌దువులన్ని ఇత‌ర ఉద్య‌మానికి సంబంధం లేని వారికే కేటాయించారు. అన్నా నీ కాలు మోక్కుతా అని నామినేటేడ్ ప‌ద‌వులు ఇవ్వండి అంటూ మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ పెడుతున్నారు. గ‌తంలో మంత్రి కేటీఆర్ కాలు మొక్కుతున్న ఫోటోను జ‌త చేసి తెరాస నాయ‌కురాలు డీనా ఎన్నో సంవ‌త్స‌రాలుగా నామినేటేడ్ ప‌దువుల కోసం ఎదురు చూస్తున్నాం… న‌న్ను ఆశీర్వ‌దించండి అన్నా అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ ఇప్పుడు క‌ల‌కం రేపుతోంది. గ‌త కొన్ని రోజులుగా టీఆర్ఎస్ తెలంగాణ‌లో గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. దీనికి ఇప్పుడు డీనా చేసిన ట్వీట్ మ‌రింత అగ్గికి ఆజ్యాం పోనిన‌ట్లు ఉంది. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికే అధికారాలు ఇస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. దీనికి తోడు ఈట‌ల పార్టీకి రాజీనామా చేయ‌డం, అత‌ని బాట‌లో మ‌రికొంత మంది ఉన్నార‌ని త్వ‌ర‌లోనే పార్టీ మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

కాగా డీనా చేసిన ట్వీట్‌కి మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.