సఫల ఏకాదశి విశిష్టత

ర‌చ‌య‌త్రి – మీనాక్షి

చాంద్రమానం ప్రకారం పక్షము రోజులలో 11 వ తిథి ఏకాదశి
ఏకాదశి కి అధి దేవత పరమేశ్వరుడు
ప్రతినెలా పౌర్ణమి మరియు అమావాస్యలకు ముందు ఏకాదశి తిథి వస్తుంది ఆషాఢ శుక్ల ఏకాదశి ని ప్రథమ ఏకాదశి గా పరిగణిస్తారు సంవత్సరం మొత్తం లో 12 శుక్ల ఏకాదశులు వస్తాయి అలాగే అమావాస్యకు ముందు గా వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి గా పరిగణిస్తారు ఈ బహుళ ఏకాదశులు కూడా 12 వస్తాయి. ప్రతీ ఏకాదశి కి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది.

హిందూపురాణాల్లో ఏకాదశి ఉపవాసం చాలా మంచిదని చెప్పబడింది. కఠోరమైన తపస్సు, అశ్వమేధ యాగం, అన్ని పవిత్ర నదులలో స్నానం చేయడం కంటే ఈ ఉపవాసం చేస్తే కలిగే పుణ్యం గొప్పదని నమ్మకం. ఏకాదశి వ్రతం పుణ్య ప్రభావం వలన, పాపాలు నశించి.. భూమిపై సుఖంగా జీవించి చివరకు పరమాత్మలో లీనమవుతాడని విశ్వాసం. ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చు.

సఫల ఏకాదశి విశిష్టత

ప్రతి నెలలో వచ్చే ఏకాదశి వ్రతాన్ని వివిధ పేర్లతో నిర్వహిస్తారు. పుష్య మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. సఫల ఏకాదశి 24 ఏకాదశిల్లో మొదటి ఏకాదశిగా పరిగణించబడుతుంది. ఈసారి సఫల ఏకాదశి డిసెంబర్ 30, 2021, గురువారం వచ్చింది. దీంతో ఏకాదశి ఈ సంవత్సరం చివరి ఏకాదశిగా జరుపుకుంటారు. సఫల ఏకాదశి వ్యక్తి చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది. ఈ ఉపవాసానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం..

సఫల ఏకాదశి పూజా విధానం

ఏదైనా ఏకాదశి ఉపవాసం దశమి నాడు సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. దశమి తిథి నాడు సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకోవాలి. అనంతరం ఉపవాస నియమాలను పాటించాలీ. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. అభ్యంగ స్నానం చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి. గంగాజలం చల్లి విష్ణువును పూజించాలి.పసుపు, కుంకుమ, గంధాక్షతలు పువ్వులతో అర్చన చేసి పండ్లు దేవునికి నివేదన చెయ్యాలి అనంతరం సఫల ఏకాదశి ఉపవాసం కథను చదవాలి. ప్రసాదం సమర్పించి హారతి ఇవ్వాలి. రోజంతా మెలకువగా నారాయణుని స్తోత్రాలను జపిస్తూ జాగారం చేయాలి. మరుసటి రోజు, స్నానం చేసిన తరువాత, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. అవకాశం లేని పక్షంలో లో స్వయంపాకం సమర్పించవచ్చు. తరువాత, ఆశీర్వాదం తీసుకుని, ఉపవాసం విరమించాలి. దశమి రాత్రి నుండి ద్వాదశి నాడు ఉపవాసం వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

ఉపవాసం యొక్క ప్రాముఖ్యత

సఫల ఏకాదశి ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిరునికి వివరించాడు. , పెద్ద యాగాలు చేసినా, సఫల ఏకాదశి వ్రతానికి ఉన్నంత సంతృప్తి నాకు లభించదు. ఈ ఉపవాసం వ్యక్తికి అన్ని పనులలో ఆశించిన విజయాన్ని ఇస్తుంది. అత్యంత పుణ్యం, శుభప్రదం. భక్తులు ఈ వ్రతంతో ఉత్తమ ఫలితాలను పొందుతారు. అటువంటి వ్యక్తి జీవిత సుఖాలను అనుభవిస్తూ మరణానంతరం విష్ణులోకాన్ని పొందుతాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించినట్టు పురాణాల వచనం అని పెద్దలు చెపుతారు.