తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేధాలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఒకరిపై ఒకరు అధిజ్ష్టనానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో హస్తినాలో రాజకీయ మంటలు రేగాయి. తెలంగాణలో పట్టుకొల్పోయిన పార్టీని తిరిగి అధికారంలో ఎలా తీసుకురావాలనే ఆలోచనలో అధిష్టానం ఉంటే… ఈ ఫిర్యాదులతో హస్తిన పెద్దలకు తలనొప్పిగా మారాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో మొదటి నుంచి సీనియర్ నాయకులను పక్కన బెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిజం చేస్తూ.. ఇతర పార్టీ నుంచి వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పీసీసీ పదివి చేపట్టిన నాటి నుండి అంతర్గతంగా, బహిరంగా తమ వ్యతిరేకత తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఈ పీసీసీ అధ్యక్షుడు తమకు వద్దని, వేరే వారిని మార్చాలని. దీంతో అంతర్గత కుమ్ములాటలు మరోమారు బహిరంగం కావడంతో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజల్లో చులకనగా మారింది. ఉన్న ఓటు బ్యాంక్‌కు కాపాడుకొని, ఎత్తుకు పై ఎత్తులు వేసి అధికారంలోకి రావాలని రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పితే తన సొంత ఇమేజ్‌ను పెంచుకోవడం తప్పా… పార్టీలో అందరినీ కలుపుకోని పోవడం లేదని లేఖలో ప్రధానంగా రాసుకవచ్చారు జగ్గారెడ్డి.
గతంలో రేవంత్‌రెడ్డిని బహిరంగా వ్యతిరేకించిన వారిలో మొదటి వరసలో ఉన్నవారు వీహెచ్, ఇప్పుడు జగ్గారెడ్డికి ఆయన మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, బట్టి, ఉత్తమ్ ఇలా చాలమంది నేతలు రేవంత్‌ని వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు జగ్గారెడ్డి ఒక్కరే స్వంతగా లేఖ రాశారా.. లేఖ ఆయన వెనుక సీనియర్ నేతలు ఏమైనా ఉన్నారా అనేది తేలాలి.
అయితే ఈ కుమ్ములాటలు ఎక్కడో చోట స్వస్తి పలకకపోతే భవిష్యత్తు రాజకీయం మరింత దారుణంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.