హస్తంలో జగ్గారెడ్డి లేఖ కలకలం ఇక రేవంత్‌కి
కాంగ్రెస్ పార్టీ ఇది ఓ పెద్ద సముద్రం అనడంలో తప్పులేదు. ఎంతో మంది నాయకులను తయారు చేసి దేశానికి అంకితం చేసిన పార్టీ. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. సొంత పార్టీ నేతలో బహిరంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై విమర్శలకు దిగుతున్నారు. ఇప్పుడు ఏకంగా అతన్ని మార్చాలని కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌గాంధీలకు లేఖ రాశారు.
అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదు. రేవంత్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఉత్తమ్, కోమటిరెడ్డి, బట్టిలతో పాటు అనేక మంది వ్యతిరేకత చూపారు. అయినా కానీ పార్టీ రేవంత్ వైపే మొగ్గు చూపింది. ఇటీవల కాలంలో కోమటి రెడ్డితో సన్నిహితం పెరుగుతోంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఒకే వేదికపై ఇద్దరు కలుసుకోవడం, ముచ్చటించడం జరిగాయి. ఇంటి వర్గ పోరు తగ్గుతున్న తరుణంలో ఇప్పుడు జగ్గారెడ్డి లేఖ పార్టీలో కలకం సృష్టిస్తోంది.
పార్టీలో అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని తన లేఖలో కోరారు. లేదంటే పార్టీ మార్గదర్శనంలో నడిచేలా రేవంత్ ను నియంత్రించండి అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ వైఖరి కంటే సొంత ఇమేజ్ కోసమే పనిచేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. స్టార్ లీడర్ గా ఎదగాలనుకుంటున్న రేవంత్ రెడ్డి తనకు నచ్చిన నిర్ణయాలే తీసుకుంటున్నారని, సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దించలేదని అన్నారు. తన వైఖరి మార్చుకోవాలని చెప్పేందుకు ఫోన్ చేస్తే రేవంత్ స్పందించడంలేదని ఆరోపించారు.