అధికమవుతున్న కంటి సమస్యలు : డాక్టర్ బద్రీ ప్రసాద్ డోగ్నే
మహమ్మారి కారణంగా మన జీవితాల్లో ఇటీవల సంభవించిన మార్పులు అనేక కంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ఇంట్లో ఉండటం, నిరంతరం స్క్రీన్ చూస్తూ ఉండటం వలన అంతర్జాతీయంగా రిఫ్రాక్టివ్ లోపాలు బాగా పెరుగుతున్నాయి. దగ్గరగా ఉండి పనులు చేసే సమయం, తీవ్రత పెరగడం వలన రిఫ్రాక్టివ్ లోపం పెరుగుతోంది. రెటినాపై కాంతి సరిగ్గా పడకుండా కంటి ఆకృతి చూసినప్పుడు రిఫ్రాక్టివ్ లోపాలు తలెత్తుతాయి. దీని వలన చూపు మసకబారడం, చదవడంలో ఇబ్బంది, కళ్లు విచలితం కావడం, ఒత్తిడి, తలనొప్పి సంభవిస్తాయి. రిఫ్రాక్టివ్ లోపానికి సంబంధించి సాధారణంగా తెలియవచ్చిన సమస్యలు:
• మయోపియా – దగ్గరి దృష్టి – కనుగుడ్డు పొడవు పెరగడం వలన ఇది సంభవిస్తుంది; ఇది సాధారణంగా పెద్దవాళ్లలో 15-49 శాతం, యువకుల్లో 1.2 శాతం నుంచి 4.2 శాతం వరకు సంభవిస్తుంది.
• హైపరోపియా- దూర దృష్టి- కనుగుడ్డు పొడవు తగ్గడం లేదా కార్నియా సరైన స్థాయిలో వంపు తిరగనప్పుడు ఇది సంభవిస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్ది పెద్దవాళ్లలో ఇది సాధారణం.
• అస్టిగ్మాటిజం – కంటి కార్నియా లేదా లెన్స్ సక్రమంగా లేకపోవడం వలన ఈ లోపం ఏర్పడుతుంది. దీని వలన కాంతి కిరణాలు రకరకాల దిశల్లో మళ్లించబడి ఒక సాధారణ ఫొకస్ పాయింట్ అన్నది లేకుండా పోతుంది.
హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ బద్రీ ప్రసాద్ డోగ్నే తెలిపారు, “దేశంలోని అన్ని వయస్సు వర్గాలు వారిని ప్రభావితం చేసే అతి సమస్యమైన కంటి సమస్య రిఫ్రాక్టివ్ లోపం. జన్యుపరమైన అంశాలు, (వయస్సు, కుటుంబ చరిత్ర, జాతి), పర్యావరణ అంశాలు (చాలా దగ్గరగా కూర్చొని అధికంగా పనిచేయడం, డిమ్ లైట్‌లో చదవడం, బయట తిరగడం తగ్గిపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అసమతుల్య ఆహారం) వంటివి కంటిని ప్రభావితం చేస్తాయి. కళ్లు రుద్దుకోవడం, అలర్జీతో కూడిన కళ్ల కలక, కాంటక్ట్ లెన్స్ ఉపయోగించడం, టోసిస్ వంటివి దీని తీవ్రతను పెంచుతాయి” అని తెలిపారు.
“గడిచిన కొన్నిసంవత్సరాలుగా డిసెంబర్‌లో 200 మంది చదవడంలో ఇబ్బంది ఏర్పడుతోందని తెలియజేశారు. బహుశా ఈ సీజన్‌లో వచ్చే సెలవులు, పిల్లలకు వచ్చే సెలవలు కారణం కావచ్చు. కాని పెద్ద నగరాల్లో నివసించే 7 నుంచి 35 సంవత్సరాల వయస్సు పురుషుల్లో 60 శాతం దీని వలన అధికంగా ప్రభావితమవుతున్నారని” డా. బద్రీ ప్రసాద్ డోగ్నే
తెలిపారు.
ఈ రిఫ్రాక్టివ్ లోపాన్ని సరిదిద్దడంపై డా. బద్రీ ప్రసాద్ డోగ్నే, “పరిస్థితి తీవ్రతను అంచనా వేస్తూ, దానికి తగిన చర్యలు తీసుకోవాలి. లక్షణాలు కనిపించని సున్నితమైన రిఫ్రాక్టివ్ లోపాలకు చికిత్స తీసుకోకుండా చాలా మంది అలాగే వదిలేస్తారు. కాని, లక్షణాలు కలిగిన రోగులు కళ్లాద్దాలు, కాంటాక్ట్ లెన్సులు, రిఫ్రాక్టివ్ సర్జరీ, లేదా మూడింటిని పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ సమస్య చాలా తీవ్రస్థాయితో కూడుకున్నది. దృష్టి లోపం ఏర్పడవచ్చు, కొన్నిసార్లు కంటి చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి రిప్రాక్టివ్ సేవలు పొందేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని సలహా ఇస్తున్నారు.
ఏటా ఈ రిఫ్రాక్టివ్ లోపాలు 8-10 శాతం పెరుగుతున్నాయి. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు, స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం, నిర్దేశించిన కళ్లద్దాలు ధరించడం, 20 20 20 వ్యాయామాలు (20 నిమిషాల స్క్రీన్ సమయం తర్వాత మీరు 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడటం) , ఆరోగ్యకరమైన సమతుల ఆహారం వంటి వాటి ద్వారా ఈ సమస్యను మనం సరిదిద్దుకోవచ్చు. ఈ సమస్యకు సులభమైన, ప్రభావవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ జనాల నిర్లక్ష్యం కారణంగా ఇది ప్రజారోగ్యాగానికి పెనుసవాల్‌గా పరిణమిల్లుతోంది. రోగి వయస్సును బట్టి చక్కదిద్దే చర్య ఉంటుంది.
“రోగి వయస్సు 18 సంవత్సరాల్లోపు ఉండి వారికి కళ్లద్దాలు ప్రిస్క్రైబ్ చేసినా, 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగి రోగులు రిఫ్రాక్టివ్ సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. అందుబటులో ఉన్న అన్ని రకాల రిఫ్రాక్టివ్ ప్రొసీజర్లలో స్మైల్ (స్మాల్ ఇన్సిషన్ లెంటిక్యూల్ ఎక్స్‌ట్రాక్షన్) అనేది సంపూర్ణ లేజర్ ప్రక్రియ. ఆపరేషన్ తర్వాత దీని ద్వారా ఉత్తమ ఫలితాలు రావడమే కాదు, ఇది వేగంగా నయమయ్యే ప్రక్రియ” డా. బద్రీ ప్రసాద్ డోగ్నేముగించారు.