తెలంగాణాలో ప్రవేశించిన గ్రోసరీ ఈ–కామర్స్
భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ఈ–కామర్స్ వేదిక ఉడాన్, నేడు తమ కమ్యూనిటీ గ్రోసరీ విభాగం– ప్రైస్ కంపెనీ తెలంగాణాలో ప్రవేశించినట్లుగా వెల్లడించింది. ప్రైస్ కంపెనీ తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించడంతో పాటుగా రాబోయే మూడు నెలల్లో 25 నగరాలు/పట్టణాలకు విస్తరించనుంది. ఈ ప్రైస్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల సూక్ష్మ వ్యాపారులు/కమ్యూనిటీ లీడర్లు తమ వ్యాపార ఆదాయం పెంచుకోగలరు. అదే సమయంలో మిల్లర్లు పండ్లు, కూరగాయలు, నిత్యావసరాలను మరింతగానూ సేకరించగలరు. ఈ ఫలితంగా వినియోగదారులు అత్యుత్తమ నాణ్యత, విస్తృత శ్రేణి ఉత్పత్తులను అత్యంత సరసమైన ధరలలో పొందగలరు.
కమ్యూనిటీ గ్రోసరీ ఈ–కామర్స్ (సీజీఈ) మోడల్ అత్యంత పురాతనమైనది. చిరు వ్యాపారులు, వినియోగదారులతో కూడిన కమ్యూనిటీ లీడర్లు విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఉడాన్ లాంటి కంపెనీల నుంచి కొనుగోలు చేయడంతో పాటుగా వినియోగదారులకు విక్రయిస్తారు.
ప్రైస్ కంపెనీ బిజినెస్ హెడ్ అంకిత్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ పలు నగరాలలో విజయవంతంగా ప్రైస్ కంపెనీని విడుదల చేయడం తో పాటుగా ఇప్పుడు మా సేవలను హైదరాబాద్‌లో ఆవిష్కరించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ వినూత్నమైన వ్యాపార నమూనా ద్వారా సరళమైన మరియు ఈ–కామర్స్ ప్రయోజనాలను మా వినియోగదారులకు సాంకేతికత సహాయంతో తీసుకురావడం మా లక్ష్యం. మా కార్యకలాపాలను విస్తరించుకోవడంతో పాటుగా చేరికనూ విస్తరించడం ద్వారా మేము మా ప్రస్తుత సంబంధాలపై ఆధారపడి చిరు రిటైలర్లు, కమ్యూనిటీ ఇన్ల్ఫూయెన్సర్లతో కలిసి పనిచేస్తూ భారత్ కా ఈ–కామర్స్‌ను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తున్నాము’’ అని అన్నారు.
ప్రైస్ కంపెనీ యాప్‌ను అతి సరళంగా వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటుగా తమ ఫోన్ నెంబర్లను ఉపయోగించుకుని రిజిస్టర్ చేసుకుని తమ ఆన్‌లైన్ వ్యవస్ధాపక ప్రయాణం ఆరంభించవచ్చు.