తెలంగాణ మంత్రుల‌కు ప‌ని చేసే సోయి లేదా ?

TELANGANA MINISTERS

తెలంగాణ మంత్రుల‌పై త‌న‌దైన శైలిలో మండిప‌డ్డారు కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్‌. ఆపాయింట్‌మెంట్ లేకుండా ఎందుకు వ‌చ్చార‌ని ప్రశ్నించారు. తాను ఎవ్వ‌రిని ఢిల్లీకి ర‌మ్మ‌ని ఆహ్వ‌నించ‌లేద‌ని, త‌మ ప‌నిలో తాము బిజీగా ఉన్నామ‌ని తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మం త్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ నేతలు పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి తెలిపా రు. భేటీ అనంతరం పీయూష్‌ గోయల్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మంత్రులు తన అ పాయింట్‌మెంట్‌ కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ, ‘‘శనివారం నుంచి వారు ఢిల్లీలో ఉన్నారంటున్నారు. అపాయింట్‌మెం ట్‌ ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నా రు. వారిని నేను ఆహ్వానించలేదు. శనివారం, ఆదివారం నేను ముంబయిలో, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నా ను. వారిని ఢిల్లీకి వచ్చి ఎవరు కూర్చొమ్మన్నారు? మా పనుల్లో మేము బిజీగా ఉన్నాం. వారు ఖాళీ గా ఎలా ఉన్నారు? పనేమీ లేదా? తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని వారికి లేనట్లుంది’’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటములతో సీఎం కేసీఆర్‌ అయోమయానికి గురవుతూ.. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించా రు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలిచిన తర్వాతే ఇలా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారన్నారు.