గెల్లు ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమా ?
దేశ రాజకీయాల్లో హుజురాబాద్ ఎన్నికలు ఒక సంచలనం. ఉప ఎన్నిక జరిగి నెలలు గడుస్తున్న ఇంకా అక్కడి ప్రజల్లో అధికార పార్టీ ఓటిమి గురించే మాట్లాడుకుంటున్నారు. భాజపా నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేతిలో ఘోర పరాజయం చవి చూసింది అధికార పార్టీ తెరాస. అసలు ఈ ఓటమికి కారణం విశ్లేషణ చేస్తే సొంత పార్టీ నేతల చేసిన తప్పిదాలే కారణమంటున్నారు పోటీ చేసిన అభ్యర్తి గెల్లు శ్రీనివాస్ నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు.
హుజురాబాద్‌లో ఓటిమి తర్వాత నియోజకవర్గంలోనే మాకం వేసిన అభ్యర్తి ఓటిమి గల కారణాలపై స్థానిక నాయకులలో నిత్యం సంప్రదింపులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయానికి కావాల్సిన ఆయుధాలను సిద్దం చేసుకుంటున్నారు. హైదారాబాద్‌లో పని ఉంటే తప్పా… రాజధానికి రావడం లేదు.
దేశంలో అత్యంత ఖరిదైన ఎన్నికగా ఈ ఎన్నికలు జరిగాయని సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఒక్కొక్క ఓటు 5 వేల నుంచి ఆరు , ఏడు వేల వరకు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస చేసిన స్వయంకృపారాధాలే కొంప ముంచాయని అభ్యర్తి గెల్లు తన సొంత వారి దగ్గర ఘోల్లుమంటున్నారని సమాచారం.
గతకొంత కాలం నుండి తెలంగాణలో భాజపా హావా కొనసాగుతోందని చెప్పడంలో తప్పు లేదు. ఇందుకు ఊదహారణలే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫలితాలే. అంతే కాకుండా తెరాస నెంబర్ 2గా ఉన్న ఈటల రాజేందర్ పార్టీ మారడం, ఆ తరువాత ఎన్నికలు జరగడం అంతా వెను వెంటనే జరిగాయి. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికల్లో తెరాస గెలవడం అలాంటి విజయమే ఇక్కడ కూడా వస్తుందని ఆలోచనలో అధికార పార్టీ అక్కడ అవలంభించిన విధానాలే ఇక్కడ అమలు చేశారు. ఇదే వారి కొంప ముంచిదంటున్నారు.
నాగార్జున సాగర్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్. ఆ పార్టీ నుంచి నిలబడిన జానా రెడ్డి , సీఎం కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. ఉద్యమం సమయంలో అధికారంలో ఉన్నా…కేసీఆర్‌కి మంచి మద్దతు ఇచ్చిన వ్యక్తి. అ అభిమానంతో సాగార్ ఎన్నకల్లో జానారెడ్డిని ప్రత్యక్షంగా మాటల తిట్టవద్దని అధికార పార్టీ తెరాస నుంచి ఆదేశాలు వచ్చాయాంట అందుకే జానారెడ్డి , తెరాస పార్టీ అభ్యర్తి, అక్కడ ఆయనకు మద్దుతు ఇచ్చిన ఓ ఒక్కరూ కూడా జానారెడ్డిని పల్లెత్తు మాట అనలేదు.
అలాంటి విధానమే హుజురాబాద్‌లో ప్రయోగించారు. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలను భూజాన వేసుకున్న హారీష్‌రావు గెల్లుకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా అంతే తానై నడిపించారని గెల్లు అవేదన చెందుతున్నారు. అంతేకాకుండా పోటీలో నిలబడిందా నేనా… లేక వాళ్లా అన్నచందంగా మారిందని… ఎక్కడ కూడా తనని ఫోకస్ కానివ్వలేదని సొంత వారి దగ్గర ఘోడు వెల్లబోసుకుంటున్నారు. అంతే కాకుండా పోటీల ఉన్న తాను ఈటలపై మాట్లాడితే ఎక్కువ ఫోకస్ అయ్యేవాడినని, ఈటల భూముల వ్యవహారంపై అతని దగ్గర విలువైన సమాచారం ఉందని విశ్వసనీయ సమాచారం. ఈటల పార్టీకి రాజీనామా చేసిన తర్వాత 275 ఎకరాల భూమి లీగల్‌గా మారిందని సంచలన విషయాలు వెల్లడించారు. ఈటలపై ఎక్కడ కూడా మాట్లాడకుండా, సిద్దిపేట గ్యాంగ్ అంతా బుల్‌డోజింగ్ చేసిందని, అందువల్లే తాను ఓటిపోయారని గెల్లు అనుచరులు అంటున్నారు.
అంతేకాకుండా సొంత పార్టీ నాయకులే తన కోసం పని చేయలేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీదారుడిని నిలబెట్టకపోవడం కూడా తమ ఓటమి కారణమని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన కౌశిక్ రెడ్డి, తమ పార్టీలోకి రాకపోయి ఉంటే.. తప్పకుండా తాను విజయం సాధించేవాడినని అంటున్నారు. ఈ విషయంలో ఇలా ఉంటే గెల్లు సొంత గ్రామంలో అతను వెనకంజకు భాజపా దాదాపు 2 కోట్లు వరకు ఖర్చు పెట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. పూర్వం నుంచి గెల్లు సొంత గ్రామంలో ఉన్న వెలమలు కూడా అతని ఓటమి ప్రయత్నం చేశారని, మంత్రి కేటీఆర్ ఒక్కసారి ప్రచారానిక వచ్చారని, సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రచారానికి రాలేదని గెల్లు తన ఆత్మీయుల వల్ల బాధపడ్డాని తెలుస్తోంది.
ఇదిఇలా ఉంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ప్రచారం కోసం వచ్చి.. తమ పార్టీ నాయకుల భార్యలతో రాసలీలు కొనసాగించడం పెద్ద ప్రమాదాన్ని తీసుకవచ్చిందని.. విశ్లేషణలో తేలిందంటున్నారు గెల్లు అనుచరులు. ఈ రాసలీలల వల్ల ఒక మండలం ఓట్లు అన్ని తమ వ్యతిరేకంగా మారిందంటున్నారు. ప్రచారినికి వచ్చి పాడు పని చేయడం ఏంటని అసహానం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో హారీష్ రావు, ఇతర నేతలు తప్పా… ఎక్కడా కూడా గెల్లుకు అవకాశం రాలేదని ఆవేదన చెందుతున్నారు.
అయితే కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్లు… హుజురాబాద్‌లో గెల్లు ఓటమికి పార్టీ చేసిన సొంత తప్పిదలే కారణమని గెల్లు విశ్లేషణలో తేలాయి.