సీఎం కేసీఆర్‌పై ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. పాల‌న చేత‌కాకే ధ‌ర్నాలు చేస్తున్నార‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం… అధికారంలో ఉండి ధ‌ర్నాలు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని పేర్కొన్నారు. రైతుల చావులకు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమ ని ఆరోపించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆమె సోమవారం కామారెడ్డి జిల్లాకు వచ్చారు. ఇటీవల సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో వడ్ల కొ నుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో చనిపోయిన రైతు కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

యాసంగి వడ్లు కొనకుంటే ఆమరణ దీక్ష చేస్తా..
యాసంగిలో వడ్లను కొనకుంటే ఆమరణ దీక్షకు కూర్చుంటానని షర్మిల వెల్లడించారు. యాసంగి వడ్లు కొనబోమని కేసీఆర్‌ చెబుతున్నారని కొందరు రైతులు షర్మిల దృష్టికి తీసుకురాగా, మీరు వరి పండిస్తే కొనుగోలు కోసం తాను పోరాడుతానని, ఆమరణ దీక్ష చేపట్టయినా ధాన్యం కొనుగోలు చేయిస్తానని భరోసా ఇచ్చారు.