ఏకలవ్య ఎడ్యుటెక్ కంపెనీని ప్రారంభించిన పుల్లెల గోపీచంద్
పిల్లలు నేర్చుకునే సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఎడ్యుటెక్ కంపెనీ ఏకలవ్యను హైదరాబాద్‌లోని తాజ్ వివాంటాలో జరిగిన కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ ఆవిష్కరించారు. పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, ఎస్ఆర్ హ్యాచరీస్ డైరెక్టర్ శ్రీ తిరుపతి రెడ్డి ఈ లాంచ్‌లో పాల్గొన్నారు. కొవిడ్ పరిస్థితుల తర్వాత ఎడ్యుటెక్ మార్కెట్ గణనీయంగా వృద్ధిచెంది దాదాపు 10 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. ఈ రంగంలోకి ఏకలవ్య కొత్తగా ప్రవేశించింది.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, “సాధారణంగా నేను బ్రాండ్లకు ప్రచారం చేయను. అరుదుగా మాత్రమే సరేనంటాను. సంస్థలోని అన్ని వివరాలనూ పూర్తిగా పరిశీలించిన తర్వాతే అలా చెబుతాను. పిల్లలకు చదువు చెప్పడంలో ఉన్న చాలావరకు లోపాలను సరిదిద్దాలన్న తృష్ణతో ఉన్న బృందం నాకు ఏకలవ్యలో కనపడింది” అని చెప్పారు.
ఈ మార్కెట్‌లో ఉన్న ఇతరులందరి కంటే భిన్నంగా ఉండేందుకు ఏకలవ్యలో సిబ్బంది ఎంపికే కీలకం. మంచి ఉపాధ్యాయులతో పాటు కథలు చెప్పేవారు, సినీ దర్శకులు, కళాకారులనూ వారు ఎంచుకున్నారు.
“పిల్లల్లో కేవలం 12-15% మందికి మాత్రమే చదువుపై నిజంగా ఆసక్తి ఉంది. చాలామంది చదువుమీద దృష్టి పెట్టలేకపోతున్నారు. తల్లిదండ్రులు చెప్పారనే వాళ్లు చదువుకుంటారు. అందువల్ల పాఠాలు నేర్పడంలో కేవలం బోధన మాత్రమే కాకుండా.. వారిని కూర్చోబెట్టడం అతిపెద్ద సవాలు అవుతోంది. వాళ్లలో ఆసక్తి కలిగిస్తే స్వయంగా చదువుకోగలరు. అదే మా వ్యూహం. అందుకే మేం ఇలా ఆసక్తి లేని విద్యార్థులను కూడా చదివించగలిగే వాళ్లను తీసుకుంటున్నాం అని ఏకలవ్య ఛైర్మన్ సంతోష్‌రెడ్డి అనగందుల చెప్పారు.
ఏకలవ్య నుంచి వస్తున్న తొలి ఉత్పత్తి చదువుకు సంబంధించిన కోర్సు కాకపోవడం గమనార్హం.
“మనమంతా పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవ్వాలనుకుంటాం. కానీ, వాళ్లు తమ లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైనవి వాళ్లకు ఇవ్వం. ఆ లోటు తీర్చడమే ఏకలవ్య స్కూల్ ఆఫ్ సూపర్‌పవర్స్ లక్ష్యం. మేం ఇందులో మొత్తం 12 కోర్సులు అందిస్తున్నాం. పరీక్షల్లో పిల్లలు ప్రతిభ చూపేందుకు మెగా మెమొరీ, క్విక్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్, డూడ్లింగ్ లాంటి పలు కోర్సులున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెగ్గుకు రావడం, సంపద రహస్యాలు, సంతోషంగా ఉండటం లాంటి జీవన నైపుణ్యాలను కూడా వారికి నేర్పుతాం. గెలిచే అలవాట్లు, బిడియాన్ని వదిలిపెట్టడం, నాయకత్వ లక్షణాలు పొందడం లాంటి విషయాలపైనా బోధించేవాళ్లు ఉన్నారు” అని ఏకలవ్య సహ వ్యవస్థాపకుడు, సీఈవో అనీల్ దీపక్ చెప్పారు.
“పిల్లలకు తాత్కాలికంగా కావల్సినవి కొనేందుకు మనం చాలా వెచ్చిస్తాం. వాళ్లకు బర్గర్లు కొనిస్తాం, సినిమాలకు తీసుకెళ్తాం. ఒక కుటుంబం అంతా కలిసి ఒక రోజు డిన్నర్‌కు వెళ్తే ఎంత ఖర్చవుతుందో, మా కోర్సులకు అంతే అవుతుంది. కానీ, ఈ కోర్సుల ప్రభావం జీవితకాలం ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్లకు ఇవ్వగలిగే అతిపెద్ద బహుమతి ఇదే. పిల్లలను విజయాల బాటలో నడిపించాలి” అని ఏకలవ్య సహ వ్యవస్థాపకుడు, సీవోవో సునీల్ రెడ్డి తెలిపారు.
“స్కూల్ ఆఫ్ సూపర్ పవర్స్ అనేది మేం ప్రారంభించే దాదాపు 12 ఇతర ఉత్పత్తుల్లో మొదటిది మాత్రమే. మేం చాలా విప్లవాత్మకమైన విద్యావ్యవస్థపై కృషిచేస్తున్నాం. దాన్ని ఏప్రిల్‌లో ప్రారంభిస్తాం. దాని గురించి చాలా ఉత్సుకతతో ఉన్నాం” అని ఏకలవ్య సీఏవో నాగేష్ పెండెం అన్నారు.
ఎడ్యుటెక్ రంగంలో ఉన్న సవాలక్ష సంస్థలలో, ఏకలవ్య తన సొంత గుర్తింపును, సముచిత స్థానాన్ని పొందిందని మేం అనుకుంటున్నాం. రాబోయే సంవత్సరాల్లో హైదరాబాద్‌కు చెందిన ఈ స్టార్టప్ ఎంత దూసుకెళ్తుందో చూడటం ఎంతో ఆసక్తికరం.