సిద్ధార్థ, స‌మంత‌ను అంత ఘాటుగా ప్రేమించాడా ?

గత కొన్ని నెల‌ల క్రితం హీరో నాగ‌చైతన్య‌, స‌మంత విడాకులు తీసుకున్న సంగ‌తి విధిత‌మే. కానీ ఆ తరువాత జ‌రుగుతున్న ప‌రిణామాలు చ‌ర్చ‌నీయంశంగా మారుతున్నాయి. నాగ చైత‌న్య‌, స‌మంత సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టినా… నెటిజ‌న్లు అంతే ఊపుతో ఘాటుగా స్పందిస్తున్నారు.

అయితే ఇటీవ‌ల స‌మంత పెట్టిన పోస్ట్‌కు స‌మంత మాజీ ప్రియుడిగా ప్ర‌చారం జ‌రుగుతున్న సిద్ధార్థ స్పందించారు. త‌న ఎంత బాధ‌లేక‌పోతే అలా స్పందిస్తార‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ఇంత‌కి స‌మంత పెట్ట‌న పోస్ట్ ఏంటో చూద్దాం ఇప్పుడు.

కొంతమంది నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వాళ్లు నా జీవితంలో భాగమైపోయారు. కానీ.. మరికొంత మంది మాత్రం ట్రోల్‌ చేస్తున్నారు. అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు. వారందర్నీ నేను కోరేది ఒక్కటే. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్‌ చేయను. కానీ, మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఓ విధానం ఉంటుంది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

స‌మంత పోస్టు నేప‌థ్యంలో త‌మిళ హీరో సిద్దార్థ్ రిప్లై ఏంటో చూద్దాం.

‘నేటి ప్రమాదరకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధా లుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ తనంతట తనే జరగదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవడం ముఖ్యం. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానండి’ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స‌మంత కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి సోష‌ల్ మీడియాలో ఓ గ్రూప్‌ను త‌యారు చేసుకుంద‌నే అర్థంలో సిద్ధార్థ్ ప‌రోక్షంగా వ్యాఖ్యానించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు ఆమె పెంచి పోషించిన నెటిజ‌న్లు, అభిమానులే ట్రోలింగ్ చేస్తున్నార‌ని ఆ హీరో న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారంటున్నారు. త‌మ ఖ‌ర్మ‌కు తామే బాధ్యుల‌ని, దానికి ఇత‌రుల‌ను నిందించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని సిద్దార్థ్ ప‌రోక్షంగా స‌మంత‌కు హిత‌వు చెప్పార‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.