ఒమిక్రాన్ స్పీడ్ – డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు
ఒమిక్రాన్‌తో ప్రపంచ వ్యాప్తంగా మరణాలు రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పాశ్చాత్య దేశాలలో ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 10వేల కేసులు దాటాయని వెల్లడించింది. రానున్న రోజుల్లో యూకేలో 25 నుండి 75 వేల వరకు మరణాలు సంభంవించే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజాగా యూకే, డెన్మార్క్ దేశాల్లో ఒమిక్రాన్ కల్లోలం చెలరేగుతోంది.