అనుకున్న‌దే జ‌రిగింది – కారు గెలిచింది

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అనుకున్న‌దే జ‌రిగింది. 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు 6 స్థానాలు ఏక‌గ్రీవం కాగా… మ‌రో ఆరు స్థానాల‌కు ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇవాళ విడుద‌లైనాయి. ఈ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ప్ర‌ముఖ ఊహించిన‌ట్టుగానే తెరాస విజ‌యం సాధించింది.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థులు భానుప్ర‌సాద్ రావు, ఎల్ ర‌మ‌ణ, ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా నుంచి వంటేరు యాద‌వ‌రెడ్డి, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుంచి తాతా మ‌ధు, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా నుంచి ఎం కోటిరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దండె విఠ‌ల్ గెలుపొందారు. ఏక‌గ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్య‌ర్థులు.. ఉమ్మ‌డి నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి.