అభివృద్ధి చెందుతున్న ఇండియా స్కిల్స్ రిపోర్ట్
డెక్కన్ న్యూస్, బ్యూరో:
ఐఐ, ఏఐసీటీఈ,ఏఐయు, ట్యాగ్డ్, సన్‌స్టోన్ ఎడ్యువర్శిటీ మరియు యుఎన్‌డీపీ సహకారంతో వీబాక్స్ తమ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ (ఐఎస్‌ఆర్) 2022 ను విడుదల చేసింది. ప్రతిభావంతుల కోసం డిమాండ్ మరియు సరఫరా నడుమ ఉన్న అంతరాలను ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఐఎస్‌ఆర్ 2022ప్రకారం మొత్తంమ్మీద 46.2% మంది యువత గత సంవత్సరం ఉపాధి సామర్థ్యం అయిన 45.97%తో పోలిస్తే మరింత మెరుగ్గా ఉపాధి సామర్థ్యం కలిగి ఉన్నారు. మహిళల్లో సైతం ఉద్యోగార్హులు సంఖ్య పరంగా స్థిరంగా వృద్ధి కనిపిస్తుంది. ఇది 51.44%గా ఉండగా, పురుషులలో 45.97% మంది ఉద్యోగార్హులుగా ఉన్నారు. ఇక నెమ్మదిగా వృద్ధి చెందుతున్న మరో ధోరణిలో 88.6% మంది గ్రాడ్యేయేట్లు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కోరుకుంటున్నారు. ఈ అధ్యయనం వెల్ల్డడించే దాని ప్రకారం మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో అభ్యర్థులు అత్యధికంగా ఉపాధి అవకాశాలను పొందగల నేర్పు కలిగి ఉన్నారు. గత సంవత్సరం మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, కర్నాటకలలో ఇది ఎక్కువగా కనిపించింది. వీరిలోనూ బీటెక్, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు ఉపాధి అవకాశాలను పొందగల నైపుణ్యం సంతరించుకుంటున్నారు. పూనె, లక్నో మరియు త్రివేండ్రంలలో ఉద్యోగార్హత కలిగిన ప్రతిభావంతులు ఎక్కువగా ఉండగా గ్రాడ్యుయేట్లు పనిచేయాలని కోరుకుంటున్న నగరాలలో బెంగళూరు, కొచ్చి, చెన్నై నిలిచాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్‌లలో యువ ప్రతిభావంతులకు అవకాశాలు లభిస్తున్నాయి.
ఇండియా స్కిల్ రిపోర్ట్‌ను భారతదేశ వ్యాప్తంగా 3 లక్షల మంది అభ్యర్థులను పరిశీలించి రూపొందించడం జరిగింది. వీరంతా కూడా వీబాక్స్ నేషనల్ ఎంప్లాయిబిలిటీ టెస్ట్ (డబ్ల్యుఎన్‌ఈటీ)లో పాల్గొన్నారు. వీరితో పాటుగా 15 కు పరిశ్రమలకు చెందిన 150 కార్పోరేట్ కంపెనీలు సైతంఇండియా హైరింగ్ ఇంటెంట్ సర్వే– ఎర్లీ కెరీర్ ఎడిషన్‌లో పాల్గొన్నారు. వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ (డబ్ల్యుఎన్‌ఈటీ) సర్వే, భారతదేశంలో యువత ఉద్యోగార్హతలపై ఓ అంచనాను అందిస్తుంది. ఈ అధ్యయనంలో పరిశీలించిన అతి కీలకమైన అంశాలలో బిజినెస్ కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్ మరియు న్యూమరికల్ రీజనింగ్ ఉన్నాయి.