కేంద్రంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రంపై వ్యంగాస్త్రాలతో విరుచుకపడ్డారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే గత కొన్ని రోజులుగా ప్రెస్ మీట్‌లు పెట్టి కేంద్రంపై యుద్ధం చేసినట్లు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు ఆయనకు తోడుగా ఆయన తనయుడు కేటీఆర్ కూడా జతకలిశారు. కరోనా విషయంలో కేంద్రం దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. అసలు ఎన్టీఏ ప్రభుత్వం అంటే నో డాటా అవలేబుల్ అని వ్యంగ్యంగా ట్విటర్‌లో ఛమత్కరించారు.
కరోనా వల్ల అనేక మంది వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారని, ఇంకా అనేక మంది చనిపోయారని అన్నారు. లౌక్‌డౌన్ వల్ల చిన్నతరహా పరిశ్రమలు వందలు, వేల కొద్ది మూతపడ్డాయని పేర్కొన్నారు. ఇలాంటి నివేదికలు కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని అనడం సిగ్గుచేటన్నారు.