12 దేశాల‌ను చూట్టేసిన ఒమిక్రాన్

క‌రోనా వైర‌స్ కంటే భ‌యంక‌ర‌మైన వైర‌స్‌గా పేరొందిన ఒమిక్రాన్ త‌న ప్రాతాపాన్ని చూపుతోంది. మెల్లిమెల్లిగా జ‌న‌వాసాల్లోకి చొచ్చుక‌పోతోంది. కొన్ని రోజులు క్రితం దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్‌ వైరస్‌ అప్పుడే పలు దేశాల్లో విరుచకుపడటానికి సన్నహాలు చేస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌లో డెల్టా వేరియంట్‌తో ప్రపంచదేశాలన్ని అతలాకుతలం అయ్యిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాలన్నింటికి దడ పుట్టించేలా విరుచకుపడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ గురించి డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించని కొద్ది రోజుల్లోనే జపాన్‌, ఐరోపా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌తో సహా సుమారు 12 దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన తొలి కేసులు నమోదైనట్టు ధృవీకరించడం గమనార్హం. తాజాగా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియా దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులలో కొత్త కోవిడ్ -19 వేరియంట్ తొలి కేసులను గుర్తించినట్లు ధృవీకరించింది.