ఆరోగ్యమంత్రి హారీష్‌రావుకి కొత్త సవాల్
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హారీష్‌రావు కొత్త సవాలు వచ్చి పడింది. ఈటల రాజేందర్‌ని పార్టీని నుంచి తప్పించిన తరువాత ఆరోగ్య శాఖ కొన్ని రోజుల పాటు సీఎం స్వయంగా చూశారు. హుజురాబాద్ ఎన్నికల తరువాత ఆ బాధ్యతలను తన మేనల్లుడైన హారీష్‌రావుకి అప్పగించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్ ప్రజలను బయపెట్టిస్తుంది. గతంలో కరోనా సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ వైరస్ నుంచి ప్రజలను కాపాడాడానకి చాలా కష్టపడ్డారు అని స్వయంగా సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఇప్పుడు కొత్త వేరియంట్ చాలా డేంజర్‌గా ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా కంటే తీవ్రమైన లక్షణాలు, మరణాలు రేటు ఎక్కువుగా సంభవించే అవకాశం ఉందంటున్నారు. మరీ ఇలాంటి పరిస్థితులను హారీష్‌రావు ఎలా ఎదుర్కుంటారు అనేది ప్రశ్నగా మారింది.
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. గతంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా ప్రైవేట్ ఆసుపత్రులపై మొగ్గు చూపారు. గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వసతులు సరిగా లేక రోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే ఆయా ఆసుపత్రుల్లో మొరుగైన సేవలు అందిస్తారా లేక చేతులేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.