టిఫిన్ చేద్దామని వెళ్లి ట్యాంక్ బండ్లో పడ్డారు
ఉదయాన్నే లేచి ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా టిఫిన్ చేద్దామని వెళ్లి ట్యాంక్‌బండ్ పడ్డారు. వివరాల్లోకి వెళితే ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన ముగ్గురు మిత్రులు ఆదివారం ఉదయం లేచి బయట టిఫిన్ చేద్దామని కారు తీసుకొని బయలు దేరారు. ఎన్టీఆర్ మార్గ్‌లో అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ట్యాంక్‌బండ్‌పై ఉన్న గ్రిల్స్‌ని ఢీ కొట్టి ట్యాంక్‌బండ్‌లో పడ్డారు. దీంతో కారు ముందు పూర్తిగా పాడై పోయింది. ఇటీవలే కొత్తాగా కారు కొన్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం వారు మద్యం మత్తులో ఉన్నారా లేక కారు అదుపు తప్పడమా అనే వివరాలు తేలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.