వణికిస్తున్న కొత్త వైరస్ ఇదే
కరోనా నుండి పూర్తిగా కోలుకోక ముందే ప్రపంచాన్ని మరోమారు భయం గుప్పిట్లో నెట్టేస్తోంది కొత్త వైరస్. ప్రజలందరిని ఘడఘలాడించి కరోనా కన్నా ఈ వైరస్ మహా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యమైన న్యూయార్క్‌లో అత్యవసర పరిస్థితులను విధించారు.
ఈ వైరస్ మొదటా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఆ దేశం నుండి వస్తున్న ప్రయాణికులను పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమ దేశాల్లోకి అనుమతిస్తున్నారు. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఈ వేరియంట్‌లో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించింది. వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా కొత్త వేరియంట్ B.1.1.529కు ‘ఒమిక్రాన్’గా నామకరణం చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూహెచ్ ఒమిక్రాన్‌ని అత్యంత ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్ జాబితాలో చేర్చింది. ముందు జాగ్రత్తగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పటివరకు కొత్త వేరియంట్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కానీ, పలు దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే శీతాకాలంలో కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని, కోవిడ్ చికిత్సలకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.