హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమంత
సమంత పరిచయం అక్కర్లేని పేరు. సినిమా రంగంలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న తను… ఆశించిన స్థాయిలో నిజ జీవితం సాగాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైత్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన భవిష్యత్తుపై దృష్టి సారించింది. సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని రుజువు చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 సినిమాలు ఓకే చేసింది. పుష్ప సినిమాలో బన్నీ సరసన ఐటెంసాంగ్ కూడా చేయబోతోంది. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్టు ప్రకటించింది ఈ బ్యూటీ.
ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఓ ఇంటర్నేషనల్ ఫిలిం చేయబోతోంది సమంత. ఈ సినిమా పేరు ఎరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్. ఇదే పేరుతో భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన పుస్తకానికి నవలా రూపం ఈ చిత్రం. ఈ సినిమాలో బై-సెక్యువల్ తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతోంది. అంటే, కేవలం పురుషులకు మాత్రమే కాకుండా, స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర అన్నమాట.
ఫ్యామిలీ మేన్ సీజన్-2లో ఆమె పోషించిన రెబల్ తమిళ యువతి పాత్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన వివాదాస్పద పాత్రను పోషిస్తోంది సమంత. పైగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారు. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఛాలెంజింగ్ రోల్ తో నటిగా తననుతాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటోంది సమంత. డ్రీమ్ వారియర్ బ్యానర్ పై ఓ ద్విభాషా చిత్రం చేయబోతోంది సమంత.