“ఉచిత సెకండ్ ఒపీనియన్ లివర్ క్లినిక్” ప్రారంభించిన గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి
కాలేయ వ్యాధుల సమస్యలకు అత్యుత్తమ వైద్యం అందించడంలో ఎప్పటినుంచో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (లక్డీకాపుల్)లో ఇకపై గురువారాలు “ఉచిత సెకండ్ ఒపీనియన్ లివర్ క్లినిక్” నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తమ కాలేయం పరిస్థితి గురించి నిపుణుల సలహాలు కోరుకునేవారి కోసం వీటిని నిర్వహించనున్నారు. రోగులు, వారి కుటుంబసభ్యులకు పూర్తి ఉచితంగా సలహాలు ఇచ్చి, సాయం చేసేందుకు లివర్ ఫిజిషియన్లు, సర్జన్లు అందుబాటులో ఉంటారు.
ఈ క్యాంపుల గురించి గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (లక్డీకాపుల్) సీఈవో గౌరవ్ ఖురానా మాట్లాడుతూ, “మానవ శరీరంలో కాలేయం చాలా కీలకమైన అవయవాల్లో ఒకటి. దానిపై దుష్ప్రభావాలు కలిగించే కారణాలు చాలా ఉంటాయి. చాలా సందర్భాల్లో కాలేయం ఆరోగ్యపరిస్థితి గురించి పెద్దగా తెలియదు. సమస్య బాగా ముదిరిన తర్వాతే వైద్యసాయం కోసం వెళ్తారు. ఈ “లివర్ క్లినిక్” ద్వారా నిపుణుల నుంచి సరైన సలహా తీసుకోవాలనుకునే వారికి ఒక మంచి అవకాశం లభిస్తుంది” అని తెలిపారు.
కామెర్లతో బాధపడుతున్నా, మద్యపాన సమస్యలు వచ్చినా, లివర్ సిరోసిస్ తీవ్రంగా ఉన్నా, ఫ్యాటీలివర్, లివర్ క్యాన్సర్ర, వైరల్ హెపటైటిస్ లాంటి సమస్యలున్నా ఇక్కడి వైద్యుల వద్దకు తమ ప్రస్తుత ఆరోగ్య రికార్డులతో వచ్చి చికిత్స పద్ధతులపై సెకండ్ ఒపీనియన్ ఉచితంగా తీసుకోవచ్చు. కొందరు పేషెంట్లకు ఆపరేషన్ అవసరమని ఇంతకుముందు ఎవరైనా చెప్పచ్చు. అయితే అది వారితో పాటు కుటుంబసభ్యులకూ జీవితాన్ని తలకిందులు చేసే నిర్ణయం కావచ్చు. అలాంటి సందర్భాల్లో అత్యుత్తమ చికిత్స ఏదన్న విషయంపై రోగులు, వారి కుటుంబసభ్యులకు మంచి నిర్ణయం తీసుకోడానికి మా వైద్యులు అందుబాటులో ఉంటారు.
హెపటాలజీ నిపుణుడు డాక్టర్ చందన్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్, లీడ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ వై. రాఘవేంద్ర బాబు, కన్సల్టెంట్ హెచ్‌పీబీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ ఇకపై ప్రతి గురువారం గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (లక్డీకాపుల్)లో అందుబాటులో ఉండి సెకండ్ ఒపీనియన్ ఇస్తారు. జంకు, పరిణామాల గురించిన ఆందోళన, ఆపరేషన్ తర్వాత వచ్చే సమస్యల లాంటివి రోగులతో పాటు వారి కుటుంబసభ్యుల మనసులో మెదులుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో నిపుణుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచి నిర్ణయం.
గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి గురించి:
హైదరాబాద్ లక్డీకాపుల్ ప్రాంతంలోని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి భారతదేశంలోని టెర్షియరీ కేర్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యుత్తమమైనది. గడిచిన 20 ఏళ్లుగా అవవయ మార్పిడి విషయంలో మధ్య, తూర్పు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆసుపత్రికి ఎన్ఏబీఎల్, ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఉంది. 150 పడకలతో ప్రతియేటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలకు చెందిన లక్షల మంది పేషెంట్లకు సేవలు అందిస్తోంది.
ఈ ఆసుపత్రికి అన్ని ప్రధాన ఆరోగ్యబీమా సంస్థలతో ఒప్పందం ఉంది, హైదరాబాద్‌లోని అన్ని కార్పొరేట్ సంస్థలలో ఎంప్యానల్ అయింది. అడ్మిషన్లకు ముందు, తర్వాత అవసరమైన సేవల కోసం భారత్‌తో పాటు సార్క్ దేశాల పేషెంట్లకు వీడియో కన్సల్టేషన్ సేవలను కూడా అందిస్తోంది.