తెలంగాణలో తెరాస పీఠాలు కదులుతున్నాయా ?
తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారునుందా అంటే అవుననే అంటున్నారు సీనియర్ రాజకీయ నాయకులు. స్వరాష్ట్రం సిద్దించిన నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత వచ్చిన ఎన్నికల్లో విజయం సాధించిన రోజున సీఎం కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారాక రామరావు మాట్లాడుతూ తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు…. ఇది తెలంగాణ రాజకీయ సమితి అని అభివర్ణించారు. అంతవరకు బాగానే ఉంది. రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చారు. పక్క పార్టీలో గెలిచిన వారిని తీసుకొని మరీ మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ పీఠాలు కదులుతున్నాయి. అందుకే స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్టీ పీఠాలు కదలడం ఏంటీ, అసలేం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో అంటే ఈ కథనం చదవండి.
రాజకీయాల్లో అరితేరిన వ్యక్తి, తన మాటల మంత్రంతో మంత్రముగ్దులను చేసే వ్యక్తి ఎవరన్న ఉన్నారు అంటే అది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే. తనకు నచ్చిన వారిని అందలమెక్కిచడం, నచ్చని వారిని పాతళంలోకి తొక్కేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి. ఆలే నరేంద్ర నుండి మొన్నటి రాములమ్మ (విజయశాంతి), నిన్న ఈటల రాజేందర్ ఇలా చెప్పుకుంటే పోతుంటే చాలా మందే ఉన్నారు. పొమ్మనలేక పోగబెట్టి బయటకి పంపినవారు, పార్టీ నుండి ఉన్నపలంగా సస్పెండ్ చేసిన వారు. ఇలా చెప్పుకుంటే వెళ్తుంటే చిట్టా బాగా పెద్దగనే ఉంది.
అయితే తెరాస నుండి బయటకు వెళ్లి భారతీయ జనతా పార్టీలో చేరి బలీమైన శక్తులుగా ఎదుగుతున్నారు. వారు ఎదగడమే కాకుండా భాజపాను కూడా బలమైన పార్టీగా మార్చి తెలంగాణలో అధికారంలోకి తీసుకవచ్చే ప్రయత్నాలు జోరుగు సాగుతున్నాయి. ఇందుకు నిదర్శనం గతంలో జరిగిన సాధారణ ఎన్నికల దగ్గర నుండి దుబ్బాకలో రఘునందన్‌రావు విజయం తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటడం తర్వాత సీఎం రంగంలోకి దిగి పావులు కదిపిన ఈటల విజయం వరకు. ఇలా ఆ పార్టీ బలపడడానికీ అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈటల విజయం తర్వాత భాజపా మరింత బలపడుతున్న విషయం పసిగట్టిన సీఎం. తనే స్వయంగా రంగంలోకి దిగారు. ఆ పార్టీని ఇప్పుడు ఢీ కొట్టకపోతే… భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని పసిగట్టారు. ఈటల గెలుపు తర్వాత, వరుసగా రెండు రోజులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన అక్కసు వెల్లగక్కాడు. అంతే కాకుండా కేంద్రంపై యుద్ధం చేస్తానంటూ రంగంలోకి దిగారు. రైతులను కేంద్రం మోసం చేస్తుందని ప్రజల్ని ఆయోమయంలోకి తీసుకవెళ్లేలా చేస్తున్నాడు. తన రాజకీయ పబ్బం కోసం ఇప్పుడు రైతులను ముందుకు నెట్టాడు. అన్ని రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడే దాన్యం కొనుగోలు ఇక్కడే ఎందుకు సమస్యగా మారింది. అనేది ప్రజలు పసిగట్టే వరకు సీఎం కేసీఆర్ ఆడే బాగోతం ఏనాటి బయటపడుదు.
యాసంగిలో వరి వేయద్దు అంటే చెబుతున్నది రాష్ట్ర ప్రభుత్వామా లేక కేంద్ర ప్రభుత్వమా అనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విషయం పక్కనబెట్టి… దాన్యం కేంద్రం కొనడం లేదని వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. భాజపా పార్టీ తెలంగాణలో పాతుకుపోతుందన్న భయంతో తెలంగాణ వాదాన్ని తెరమీదకు తీసుకవచ్చారు సీఎం.
తెలంగాణలో వేరే పార్టీకీ అధికారం ఇవ్వకూడదనే ఒక్క అక్కసుతోనే సీఎం రైతన్న జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.