25 న ప్రి-బిడ్ అవగాహన సదస్సు

ప్రతిష్టాత్మక ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లోని ప్లాట్ల ఈ-వేలం పై కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు హెచ్ఎండీఎ అధికారులు ఈ నెల 25 న ప్రి-బిడ్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఎ అభివృధ్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లే-అవుట్ 2 వ ఫేజులోని ప్లాట్ల విక్రయానికి రానున్న 7 మరియు 8 ఏప్రిల్ తారీఖుల్లో ఈ వేలం నిర్వహిస్తుండటం తెలిసిందే. ఈ సంధర్భంగా హెచ్ఎండీఎ కార్యదర్శి ఎం.రాంకిషన్ మాట్లాడుతూ బహుళ ప్రయోజన భవనాలను నిర్మించుకునేందుకు వీలుగా సదరు లే-ఆవుట్ ను మల్టీ జోన్ గా ప్రకటించడం జరిగిందని, 30 మీటర్ల వెడల్పాటి రోడ్లతో, అన్ని మౌళిక వసతులతో మెట్రో స్టేషన్ కు అతిచేరువలో ఉన్న ప్రాజెక్టు ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నామని చెప్పారు. కావున ఈ-వేలం లో పాల్గొనే వారి సహాయార్ధం ప్రి-బిడ్ అవగాహనా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం, 25 ఏప్రిల్ నాడు ఉదయం 11 గంటలకు తార్నాకా లోని హెచ్ఎండీఎ కేంద్ర కార్యాలంలోని రెండవ అంతస్తులో ఏర్పాటు చేయనున్న సమావేశంలో ఈ-వేలం లో పాల్గొనబోయే కొనుగోలుదారులు తమ పేరును ఎలా నమోదు చేసుకోవాలి, ఎలా వేలం లో ధర ను బిడ్ చేయాలి( వేలం పాడాలి) లాంటి సాంకేతిక అంశాలతో కూడిన సమాచారాన్ని అధికారులు అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు. అలాగే కొనుగోలు దారులెవరైన తమకున్న ఇతర సందేహాలను నివృత్తిచేసుకోవచ్చని అన్నారు. కావున పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు గంగాధర్ ఎస్టేట్, ఆఫీసర్ (9491739490) మరియు యం.సరస్వతి, డిఎఓ (9989336908) ను ఫోను ద్వారా కాని నేరుగా కాని సంప్రదించవచ్చని తెలిపారు.