ప్రజలు ఇప్పుడు దేనితో నవ్వాలి దొర
కొట్లాడి సాధించుకున్న రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, మీ ఇంట్లో వాళ్లు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. రాష్ట్రంలో మీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. అందుకే మీరు చెప్పిందే వేదంగా నడుస్తోంది రాష్ట్రంలో. అందుకే మాకు కష్టాలు ఉన్నాయని చెప్పుకోడానికి ఓ వేదికను కూడా లేకుండా చేశారు సాధరణ ప్రజలకు. మీ అధికారంలో అనిచివేతలే తప్పా… అన్యాయవుతున్న వారిని పట్టించుకోవడం మీకు ఇష్టం లేదు . అందుకే ధర్నాలు చేసే ధర్నా చౌక్‌ని ఇందిరా పార్క్ నుండి లేకుండా చేశారు.
కానీ ఇప్పుడు మీకు అదే దిక్కు అయింది. అధికారంలో ఉండి ధర్నా చేయడానికి మీరు వద్దు అనుకున్నదే మీకు ఇప్పుడు ముద్దైంది. చూశావా కాలం ఎప్పుడు ఎలా చేస్తుందో ఎవరికి తెలియదు. రైతులు పండించిన పంటు కొనడానికి కేంద్రం మీద మీరు ఒత్తిడి తీసుకరావడానికి ధర్నాలు చేస్తున్నారు. సరే కానీ మీరు వద్దు అన్న చోట మీరేలా ధర్నాలు చేస్తారని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా వెళ్లి సరూర్ నరగ్‌లో ధర్నాలు చేయాలంటున్నారు. ఇప్పుడు మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?.











