సీఎం కేసీఆర్ త‌న‌ అత్యంత సన్నిహితుడికి చెక్ పెట్టిండా ?

సీఎం కేసీఆర్ త‌న అత్య‌తం స‌న్నిహితుడు, మేన‌ల్లుడు హారీష్ రావు చెక్ పెట్టారు అంటూ గ‌త రెండు రోజులు నుండి రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత దేవాదాయ‌శాఖ మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోతారు అనేది అనాదిగా వ‌స్తుంది. అయితే దీన్ని ప‌టాపంచ‌లు చేసేవారు సీఎం కేసీఆర్‌. అల్లోళ్ల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆ మంత్రి ప‌దవి చేసిన త‌ర్వాత మ‌ళ్లీ అతన్నే గెలిపించుకున్నారు సీఎం. అయితే వారి అంచ‌నాల‌కు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన‌వారు త‌మ పార్టీలో త‌మ ప‌ట్టుకోల్పోయారు.

స్వ‌రాష్ట్రంలో మొద‌టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తాటికొండ రాజ‌య్య అన‌ధికాలంలో క‌నుమ‌రుగ‌య్యారు. అత‌నిపై స్వ‌యంగా సీఎం కేసీఆర్ చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. లోప‌ల జ‌రిగింది ఒక‌టి బ‌య‌ట ప్ర‌చారం జ‌రిగింది ఒక‌టి అని అప్పుడు నేతలు చెవులు కొరుక్కున్నాయి. క‌రుణుడి చావుకి ల‌క్ష కార‌ణాలు అన్న‌ట్టు అత‌న్ని ప‌ద‌వి నుండి త‌ప్పించ‌డానికి అనేక కారాణాలు చెప్పుకోవ‌చ్చు. అయితే రాజ‌య్య త‌ర్వాత ఈట‌ల ఆ స్థానంలోకి వ‌చ్చారు. అయితే ఇత‌ని ప‌రిస్థితి కూడా అంతే పార్టీలో నుండి పొమ్మ‌న‌లేక పొగ పెట్టారని చెప్పుకోవ‌చ్చు. అవినితీ ఆరోప‌ణ‌లు, మెద‌క్ జిల్లా, అచ్చంపేట‌, హ‌క్కీంపేట‌, ధ‌రిప‌ల్లి గ్రామాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఇలా అనేక కారాణాలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు అస‌లు క‌థ మొద‌లైంది. వైద్య ఆరోగ్య శాఖ చేప‌ట్టిన వారు పార్టీలో ఎక్కువ రోజులు ఉండ‌లేర‌ని, మంత్రి ప‌ద‌వి పోవడం, పార్టీ నుంచి తొల‌గించ‌డం వంటివి జ‌రుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల త‌ర్వాత వైద్య ఆరోగ్య శాఖ‌ను త‌న అల్లుడైన ఆర్థిక‌శాఖ మంత్రి హారీష్ రావుకి అప్ప‌జెప్పాడు. కాగా త్వ‌ర‌లో హారీష్‌రావు పార్టీ మారుతున్నార‌ని ట్రోల్స్ మొద‌లు పెట్టారు నెటిజ‌న్స్‌. పార్టీలో హారీష్ స్థానం గురించి కాల‌మే నిర్ణ‌యించాలి.