గంజాయి సాగు చేస్తానని కలెక్టర్‌కి లేఖ రాసిన రైతు
మీరు చదివిన శీర్షిక అక్షరాల నిజం. పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరితో పాటు పలు వాణిజ్య పంటలు పండిస్తున్నా… ఆదాయం రావడం లేదంటున్నారు. పండిస్తున్న పంటలకు డిమాండ్ లేదని, గంజాయి సాగుకి భారీ డిమాండ్ ఉందని ఓ రైతు జిల్లా కలెక్టర్‌కి లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్తే…
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మొహోల్ తహసీల్‌కి చెందిన అనిల్ పాటిల్ అనే రైతు అనుమతి ఇస్తే గంజాయి సాగు చేసుకుంటునానని జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. ఏ పంట పండించిన గిట్టుబాట లేక నష్టాలు వస్తున్నాయని, తనకున్న రెండు ఎకరాల్లో బాగా డిమాండ్ ఉన్న గంజాయి సాగు చేస్తానని ఇందుకు అనుమతి ఇవ్వాలని తన లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 15లో అనుమతి ఇవ్వాలని, స్పందన కరువైతే అనుమతి ఇచ్చినట్లే భావిస్తానని లేఖలో రాశారు. కాగా స్థానిక పోలీసులు ఆ రైతు ప్రచారం కోసం ఇలాంటి ఎత్తుగడ వేశారని, గంజాయి పండిస్తే అరెస్ట్‌లు జరుతాయని తెలిపారు.