ఎక్కువగా స్క్రీన్ చూస్తే మెల్లకన్ను : డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్
లాక్‌డౌన్ ప్రభావం వల్ల విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాస్‌లు చెప్పడం మెదలుపెట్టాయి. ఇక విద్యార్థులు ఇంటి నుండి చదవడం ప్రారంభించారు. దీనివల్ల స్క్రీన్ చూసే సమయం పెరుగుతున్నకారణంగా భారతదేశంలో పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో మయోపియా (దగ్గరి చూపు) ఏర్పడి అది విస్తరిస్తోంది. అంతే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల చికిత్స విభాగాల గణాంకాల ప్రకారం మెల్లకన్ను సమస్య 2020 నుంచి భయంగొల్పే రీతిలో పెరుగుతోందని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ వెల్లడించింది. “ఈ మహమ్మారి సంవత్సరంలో 5-15 ఏళ్ల వయస్సులోపు పిల్లల్లో మయోపియా వార్షిక విస్తృతిలో 100% పెరుగుదల, అలాగే మెల్ల కన్నుసమస్యల్లో ఐదు రెట్ల పెరుగుదల కనిపిస్తోందని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ డా. పాలక్ మక్వానా తెలిపారు.