చంటిపిల్లలను కంటి రెప్పలా కాపాడుకోవాలి : డా. మహిష్మ
వర్షకాలంలో ప్రభలుతున్న వైరల్ ఫీవర్లపై జాగ్రత్తలు పాటించాలన్నారు ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డా. మహిష్మ. గత రెండు సంవత్సరాల నుండి కరోనా ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న తరుణంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. వర్షా కాలం ప్రారంభమైన నాటి నుండి డెంగీ జ్వరం కూడా అక్కడక్కడ ప్రభలుతుంది. ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు.











