ఫిలీప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు
ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. గురువారం తెల్లవారుజామును భారీ భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.1గా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పున 63 కిలోమీటర్ల దూరంలో 65.6 కిలోమీటర్ల లోతున భూకంపం సంభంచినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. నష్టానికి సంభవించి ప్రాథమికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఫిలిప్పీన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వోల్కోనాలజీ అండ్ సిస్మోలజీ (ఫివోల్క్స్) నష్టాన్ని అంచనా వేసే పనిలో పడినట్టు ‘సీఎన్ఎన్’ తెలిపింది. దేశానికి సునామీ ముప్పు పొంచి ఉందని ఫివోల్క్స్ పేర్కొనగా, అలాంటిదేమీ లేదని యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ అండ్ హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.